Homeఅంతర్జాతీయంసౌత్ కరోలినాలో ‘అణు’ ఎమర్జెన్సీ

సౌత్ కరోలినాలో ‘అణు’ ఎమర్జెన్సీ

- Advertisement -

కొలంబియా: అమెరికా, సౌత్ కరోలినా రాష్ట్రంలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. రేడియేషన్ ముప్పు భయంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీని ఒక గదిలో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన భవనం బయటకు రేడియో ధార్మికత విడుదల కాలేదని తెలిపారు. ఆ రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ప్రజలకు ప్రమాదం వాటిల్లలేదన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లేబరేటరీ ప్రవేశ మార్గాలు మూసివేసినట్లు తెలిపారు. సమీపంలో రాకపోకలను నిలిపివేశామని చెప్పారు. పరిస్థితిని సమీక్షించి ల్యాబ్ మార్గాలు తెరుస్తామని, రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు