బెంగళూరు’ పరిమిత స్టోరేజ్, మెమరీ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు అవాంఛిత కాల్స్ పికప్ చేయడానికి ముందు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకుని బ్లాక్ చేయడానికి ప్రజలు ఎక్కువగా ఆధారపడే రక్షణను తీసుకువచ్చే కొత్త యాప్ ట్రూకాలర్ లైట్‌ను భారతదేశంలో ప్రారంభించినట్లు ట్రూకాలర్ ఈ రోజు ప్రకటించింది. సుమారు 10 ఎంబీ వద్ద, ట్రూకాలర్ లైట్ క్షణాల్లో ఇన్సాట్ల్ అవుతుంది, త్వరగా తెరుచుకుంటుంది. 4జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ లలో సజావుగా నడుస్తుంది. భారతదేశం అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ సీజన్ లోకి అడుగుపెడుతున్న వేళ స్కామ్ కాల్స్ పెరిగినప్పుడు: నకిలీ డెలివరీ కాల్స్, చాలానిజమైనఆఫర్ కాల్స్ అనిపించే కాల్స్, కేవైసీ మోసం, ఇది ప్రవేశపెట్టబడింది. మిలియన్ల మంది ప్రజలకు, చెల్లింపులు, డెలివరీలు, కుటుంబంతో సన్నిహితంగా ఉండటానికి వారు ఉపయోగించే ఫోన్ లో కూడా స్థలం తక్కువగా ఉండేది, పండుగ ఫోటోలు, వీడియోలు, ఫార్వార్డ్ లు పేరుకుపోయిన తర్వాత తక్కువ స్థలం మిగిలి ఉంటుంది. వారిలో చాలా మంది తేలికపాటి ట్రూకాలర్ కోసం అడిగారు మరియు ఇకపై రక్షణ ఆ స్థలం కోసం పోటీ పడని ట్రూకాలర్ లైట్ రూపొందింది. ట్రూకాలర్ లైట్ ప్రధాన వరüన్ యొక్క కట్`డౌన్ వెరüన్ కాదు. ఇది తక్కువ మెమరీ, ప్రాసెసింగ్ శక్తి ఉన్న ఫోన్ ల కోసం కింది స్థాయి నుండి నిర్మించినబడిన ప్రత్యేక, స్థానిక ఆండ్రాయిడ్ యాప్. ఇది అదే ట్రూకాలర్ డేటాబేస్, గుర్తింపు వ్యవస్థల నుండి సమాచారం తీసుకుంటుంది. అదే గోప్యతా ప్రమాణాలను అనుసరిస్తుంది.
స్కామర్లకు ఆస్కారం లేదు: ట్రూకాలర్ లైట్
- Advertisement -


