ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మోటర్‌సైకిల్స్, స్కూటర్ల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్, తమ ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ స్కూటర్‌కు సరికొత్త, విలక్షణమైన శైలిని తీసుకువస్తూ డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్‌ను నేడు ఆవిష్కరించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ లో ఆకట్టుకునే రీతిలో డ్యూయల్టోన్ రంగుల కలయికలు, విలక్షణమైన చారల డిజైన్స్, ప్రత్యేకమైన 3ªఈ క్లాసిక్ ఎడిషన్ చిహ్నం వంటివి ఉండటం చేత డెస్టిని 110 మరింత ఆకర్షణీయంగా మారింది. రోజువారీ ఆచరణాత్మకతను పండుగ శోభతో మేళవించి తీర్చిదిద్దిన ఈ కొత్త ఎడిషన్ డెస్టిని 110 శ్రేణికి ఒక స్టైలిష్ రూపాన్ని జోడిస్తుంది. సెప్టెంబర్ 2025లో విడుదల చేయబడిన డెస్టిని 110, సౌకర్యం, వినియోగ సౌలభ్యం, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించి భారతీయ కుటుంబాల రోజువారీ ప్రయాణ అవసరాలను తీరుస్తుంది. ఇప్పటికే తనదైన ప్రత్యేకతను చాటుతున్న వాహనానికి కొనసాగింపుగా క్లాసిక్ ఎడిషన్ తీసుకువచ్చారు. ఇందులో ప్రత్యేకమైన నియోరెట్రో డిజైన్‌ను జోడించడం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న శ్రేణికి కొత్త రూపాన్ని అందించారు. ఈ విడుదల సందర్భంగా హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ “ఫ్యామిలీ స్కూటర్ కస్టమర్ల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డెస్టిని 110 అభివృద్ధి చేయబడింది. సౌకర్యం, వినియోగ సౌలభ్యం, ఇంధన సామర్థ్యం వంటి అంశాలకు దీనిలో అధిక ప్రాధాన్యత ఇచ్చాము. కస్టమర్ల ప్రాధాన్యతలు నిరంతరం మారుతున్న నేపథ్యంలో, కొత్త డ్యూయల్`టోన్ రంగులు, విలక్షణమైన డిటైలింగ్ ద్వారా డెస్టిని 110 పోర్ట్‌ఫోలియోకు ఒక సరికొత్త డిజైన్ రూపాన్ని క్లాసిక్ ఎడిషన్ అందిస్తుంది. అదే సమయంలో ఈ మోడల్ ప్రత్యేకతల్లో కీలకమైన ఆచరణాత్మక సౌకర్యాలను కొనసాగిస్తోందని అన్నారు.
హీరో మోటోకార్ప్ డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ పరిచయం
- Advertisement -


