విశాలాంధ్ర – కడియం : మాజీమంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు కడియం మండల ప్రజలలో తనదైన ముద్రవేశారని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. శుక్రవారం జక్కంపూడి రామ్మోహన్ రావు 15 వ వర్దంతి సందర్భంగా కడియం మండలం, బుర్రిలంక గ్రామంలో జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ జక్కంపూడి మూడుసార్లు కడియం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వివిధ హోదాలలో ప్రజలకు సేవలందించాలని గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి, తిరుమలశెట్టి శ్రీను, గాద రామ కృష్ణ, గాద గోవిందు, చిలుకూరి రామకృష్ణ, రత్నం కృష్ణ, తాడాల రాము, నాగిరెడ్డి చిన్ని, బిల్లకుర్తి ముత్యాలరావు, నరమామిడి బాలరాజు, నూనె వరాలు, తూపాటి దుర్గాజీ, తూపాటి అయ్యప్ప, తానింకి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
జననేత కు ఘన నివాళులు
- Advertisement -
RELATED ARTICLES


