Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇరాన్‌తో చర్చలకు సిద్ధం : బ్లింకెన్‌

కువైట్‌ సిటీ : ఇరాన్‌ అణు ఒప్పందానికి తిరిగి రావడానికి ఇరాన్‌తో చర్చలు కొనసాగింపునకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చించడానికి కువైట్‌ విదేశాంగమంత్రి షేక్‌ అహ్మద్‌్‌ నాజర్‌ అల్‌మహ్మద్‌ అల్‌సబాతో సమావేశమైన తరువాత బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంతి ఇరాన్‌ కోర్టులో ఉంది’ అని బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మే 2018లో ఉమ్మడి సమగ్ర అణుఒడంబడిక చర్య నుండి వైదొలగింది. ఇరాన్‌పై మే 2019 నుంచి మళ్లీ ఆంక్షలు విధించింది. ఒప్పందానికి కట్టుబడిన కొన్నింటిని అమలు చేయడాన్ని ఆపివేసింది. ఏప్రిల్‌ 6 జూన్‌ 20మధ్య అమెరికా తిరిగి ఒప్పందంలోకి రావడానికిగాను వియన్నాలో చర్చలు జరిపింది. ఆరు రౌండ్ల చర్చల అనంతరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై ఇరాన్‌, అమెరికాల మధ్య తేడాలున్నాయని తేలింది. కువైట్‌తో భాగస్వామ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ దేశం కట్టుబడి ఉందని బ్లింకన్‌ తెలిపారు. ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో కువైట్‌ , గల్ఫ్‌ సంక్షోభాన్ని నివారించడంలో కువైట్‌ నాయకత్వం చూపిన కృషిని బ్లింకెన్‌ ప్రశంసించారు. రెండు దేశాలకు సంబంధించిన వివిధ విషయాలలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాముఖ్యత, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై చర్చించినట్లు కువైట్‌ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అన్ని రంగాలలో రెండు దేశాల మధ్య సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img