Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ తొలగింపు

ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌2021(ఎంసెట్‌)లో ఈ ఏడాది ఇంటర్‌ వెయిటేజీని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2021`22 విద్యా సంవత్సరానికి నిర్వహించే పరీక్షకు ఈ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇప్పటికే ఎంసెట్‌గా ఉన్న పేరును ప్రభుత్వం దాని స్థానంలో ఏపీ ఈఏపీసెట్‌గా మార్పు చేసింది. ఏటా ఇంటర్‌ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25శాతం వెయిటేజీని కేటాయించేవారు. గత విద్యా సంవత్సరం కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు రద్దుతో ఈ ఏడాది వెయిటేజ్‌ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌లోని వివిధ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడిరచింది. దీంతో అభ్యర్థులకు ఏపీ ఈఏపీసెట్‌లో మార్కులు, ర్యాంకే కీలకంగా నిలవనుంది. ఈఏపీసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీతో ముగిసింది. రూ.500 అపరాధ రుసుముతో ఆగస్టు 5వ తేదీ వరకు, రూ.1000తో 10వరకు, రూ.5వేలతో 16వరకు, రూ.10వేలతో 18వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img