Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలి


: గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌
మానవ అక్రమ రవాణా అరికట్టడానికి సమిష్టిగా కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు.మానవ అక్రమ రవాణా ద్వారా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. అమాయకులు జీవితాలు బలి అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజ్వల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రచురించిన కౌంటరింగ్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అనే ఐదు రకాల హ్యాండ్‌ బుక్స్‌ను ఇవాళ గవర్నర్‌ ఆవిష్కరించి, సంబంధిత డ్యూటీ అధికారులకు అందజేశారు. మానవ అక్రమ రవాణా నుండి కాపాడబడిన బాధితులను వివక్షకు గురి చేయకుండా వారి రిహాబిలిటేషన్‌కు కృషి చేయాలని సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్‌ ప్రజ్వల సంస్థ ద్వారా చేస్తున్న కృషిని గవర్నర్‌ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img