Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాగని పార్లమెంటు

ఆరవ రోజూ పెగాసస్‌, సాగు చట్టాలపై దద్దరిల్లిన ఉభయ సభలు

విపక్షాల ఆందోళనలతో కొనసాగిన వాయిదా పర్వం
లోక్‌సభకు తొమ్మిదిసార్లు… రాజ్యసభకు నాలుగు సార్లు బ్రేక్‌

న్యూదిల్లీ : వరుసగా ఆరవ రోజు పార్లమెంటు సాగలేదు. పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు, కొత్త సాగు చట్టాల రద్దు సహా అనేక అంశాలపై చర్చకు డిమాండు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయసభలు దద్దరిల్లాయి. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. దీంతో పార్లమెంటు బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా పడిరది. మంగళవారం లోక్‌సభ తొమ్మిదిసార్లు వాయిదా పడిరది. చివరి వాయిదాకు ముందు ప్రతిపక్ష సభ్యులను తమ స్థానాల్లో కూర్చోవాలని, సభ కార్యకలాపాలను జరగనివ్వాలని సభాపతి రాజేంద్ర అగర్వాల్‌ కోరగా వారు నినాదాలు కొనసాగించడంతో సభను వాయిదా వేశారు. ఉదయం సభ మొదలైనప్పుడు స్పీకర్‌ ఓం బిర్లా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మారిషస్‌ మాజీ అధ్యక్షుడు అనిరుధ్‌ జుగ్‌నాథ్‌, జాంబియా తొలి అధ్యక్షుడు కెన్నెత్‌ డేవిడ్‌ బుచిజ్యా కౌండాకు సభ నివాళులర్పించింది. 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. పెగాసస్‌ వ్యవహారంలో సీపీఐ, సీపీఎం, టీఎంసీ సభ్యులు ఆందోళన చేపట్టగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా బీఎస్పీ, ఎస్పీ, శిరోమణి అకాలీదళ్‌ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభను జరగనివ్వడం లేదని, ప్రశ్నోత్తరాలను సాగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌ రాం మేఘవాల్‌ అసహనం వ్యక్తంచేశారు. నినాదాలు చేసే విషయంలో పోటీ పడవద్దు.. ప్రజా అంశాలను లేవనెత్తే విషయంలో పోటీ పడండి అంటూ స్పీకర్‌ అన్నారు. వరుస వాయిదాల వల్ల సభ మర్యాద ఉల్లంఘించబడుతోందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. రైతులకు సంబంధించి 15 ప్రశ్నలు ఉన్నాయని, వాటిపై సమాధానాలను ఇవ్వనివ్వాలని విపక్షాలనుద్దేశించి అన్నారు. దాంతో 11.45 గంటలకు సభ తొలిసారి వాయిదా పడగా ఆపై సాయంత్రం మొత్తం తొమ్మిది సార్లు వాయిదాలు కొనసాగాయి. అదే విధంగా రాజ్యసభలోనూ సాగు చట్టాలు, పెగాసస్‌పై ప్రకంపనలు కొనసాగాయి. ఈ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టారు. దీంతో సభను నాలుగు సార్లు వాయిదా వేసిన చైర్మన్‌ చివరకు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌, టీఎంసీ సహా విపక్షాల ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. గందరగోళం నడుమ తొమ్మిది దశాబ్దాల నాటి చట్టం స్థానె మెరైన్‌ ఎయిడ్స్‌ నేవిగేషన్‌ బిల్లును ఎగువ సభ ఆమోదించింది. వర్షాకాల సమావేశంలో రాజ్యసభలో కార్యకలాపాలు సాగలేదు. కొవిడ్‌`19 కట్టడిపై తప్ప ఏ అంశంపైనా అర్థవంతమైన చర్చ జరగలేదు అని చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. సంతాపాల తర్వాత కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రతిపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. నిబంధన 267 సస్పెన్పన్‌పై చర్చను కొందరు కోరారు. వరుసగా ఆరవ రోజు సభ సాగడం లేదని, గతంలో కేవలం 17 నిమిషాల్లో ఎనిమిది బిల్లులను ఆమోదించడాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు కొనసాగడంతో డిక్టేషన్‌నుగానీ నాటకాలనుగానీ సభాపతి స్థానంలో ఉన్న ఎవ్వరూ అంగీకరించకని వెంకయ్య అన్నారు. ఆపై వాయిదాల తర్వాత కార్యకలాపాలను డిప్యూటీ చైర్మన్‌ నిర్వహించారు. వెల్‌లో ఉన్న సభ్యులు ఇతరుల హక్కులను హరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img