Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలుగురాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ కేసులు : కేంద్రం

తెలుగురాష్ట్రాల్లో డెల్టాప్లస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులను గుర్తించగా ఇందులో తెలంగాణాలో రెండు, ఏపీలో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ మేరకు వెల్లడిరచారు. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల్లో జరిపిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్లు మంత్రి లోక్‌సభకు తెలిపారు. దేశంలోని 28 ప్రయోగశాలల్లో కరోనా వేరియంట్లకు సంబంధించిన 58,240 నమూనాలపై జరిపిన పరీక్షించగా, వీటిలో 46,124 నమూనాలను జన్యుపరంగా విశ్లేషించినట్లు వివరించారు. 4172 నమూనాలు ఆల్ఫా వేరియంట్‌, 217 నమూనాలు బీటా వేరియంట్‌, ఒక నమూనా గామా వేరియంట్‌, 17,169 నమూనాలు డెల్టా వేరియంట్‌, 70 డెల్లా ప్లస్‌ వేరియంట్లను గుర్తించినట్లు వెల్లడిరచారు.దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 డెల్టా ప్లస్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. తమిళనాడులో 10, మధ్యప్రదేశ్‌లో 11, చండీగఢ్‌లో నాలుగు, కేరళ, కర్ణాటకలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో రెండు చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, జమ్మూ, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img