Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దిల్లీలో ఉక్కు ఉద్యమానికి సంఫీుభావం

విద్యార్థి, యువజన సంఘాల పోరుకు మద్దతు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాఖ స్టీలు ప్లాంట్‌ పరిరక్షణ వేదిక దిల్లీలో ఆగస్టు 2,3 తేదీల్లో చేపట్టిన ధర్నాకు సంపూర్ణ సంఫీుభావం తెలుపుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడలోని చంద్రం బిల్డింగ్స్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం వివరాలను రామకృష్ణ వెల్లడిరచారు.

పార్లమెంటు సమావేశాల సందర్భంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతుసంఘాల అధ్వర్యంలో జరగనున్న ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన జాబ్‌లెస్‌ క్యాలెండరుపై యువజన, విద్యార్థులు చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని, భవిష్యత్తులో విద్యార్థి, యువజనులు చేపట్టబోయే మరిన్ని పోరాటాలకు పార్టీ అండగా ఉండాలని, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే మొక్కుబడిగా జాబ్‌లెస్‌ క్యాలెండరును ప్రభుత్వం విడుదల చేసి, నిరుద్యోగుల ఆగ్రహానికి గురైందన్నారు. ఇప్పటికే ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.

అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్లు న్యాయబద్ధ పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమాలకు జిల్లాల వారీగా పార్టీ, ప్రజాసంఘాలు సంఫీుభావం తెలపనున్నాయన్నారు. ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన వాగ్దానాన్ని వైఎస్‌ జగన్‌ విస్మరించారన్నారు.

పన్నులు పెంచబోమని, ప్రజలపై భారం వేయబోమని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు మాటతప్పి ప్రజలపై పన్నులు వేయడాన్ని సమావేశం తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. దీనిపై భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ నిర్మించాలని నిర్ణయించామన్నారు. రైతు, కార్మిక సంఘాలు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నాయని చెప్పారు. జగన్న కాలనీలు వర్షపు నీటితో నిండిపోతున్నాయని, తక్షణమే వాటిపై ప్రభుత్వం స్పందించాలని, త్వరలో ఆయా ప్రాంతాలకు సీపీఐ బృందం వెళ్లి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకోనుందన్నారు. టిడ్కో ఇళ్ల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సృష్టించి, మొత్తం ఆధిపత్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.

సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు జేవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు, పీజే చంద్రశేఖర్‌, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కి లెనిన్‌బాబు, సీపీఐ నాయకులు వై.చెంచయ్య, ప్రజాసంఘాల నేతలు, పార్టీ జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img