Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పారిశ్రామికరంగంలో ముందువరుసలో తెలంగాణ

పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రానికి టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ లాంటి విప్లవాత్మక సంస్కరణలు ఎన్నో చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img