Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెగాసస్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే..

వచ్చేవారం విచారణ
దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌ సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌ను కేంద్రం ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాలని సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌ రామ్‌, శశికుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు శుక్రవారం స్వీకరించింది. పనిభారాన్ని బట్టి వచ్చేవారం వాటిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు పెగాసస్‌పై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటుచేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img