Friday, April 19, 2024
Friday, April 19, 2024

14వరకు రాత్రి కర్ఫ్యూ

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మరోసారి పొడిగింపు

అమరావతి : రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల తీవ్రత ఆశించిన మేర తగ్గకపోవడంతో మరికొంతకాలం కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. ఈసారి ఏకంగా ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఏపీ సర్కార్‌ ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్రంలో సుమారు 3,600 కరోనా పాజిటివ్‌ కేసులు వస్తుండగా, 15వ తేదీ నాటికి వెయ్యి కేసులకు తగ్గాయి. కాని గత పక్షం రోజులుగా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ 2,526 కేసులు నమోదు కాగా, 20వ తేదీ 2,498, 25వ తేదీ 2,252 కేసులు నమోదయ్యాయి. పక్షం రోజుల తర్వాత కూడా 2,068 కేసులు నమోదవడం గమనార్హం. దీనినిబట్టి 15 రోజుల వ్యవధిలో కేవలం 500 కేసులు మాత్రమే తగ్గాయి. దీంతో ప్రభుత్వం ప్రస్తుత ఆంక్షలు మరికొంతకాలం కొనసాగించాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు పంపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img