Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరోగ్య పథకంలో అనేక సందేహాలు

డా. అరుణ్‌ మిత్రా

ఆరోగ్యానికి సంబంధించిన విధానాలను మెరుగుపరుచుకొనేం దుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్న కేంద్రం వాదన ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. దేశ ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి తెలియనివేమీ కాదు. అయితే వీటి పరిష్కారానికి రాజకీయ సంకల్పమే అవసరం. ఆరోగ్య భద్రతా వ్యవస్థను ఎలా మెరుగుపరచాలన్న అంశాలను అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజ గ్రూపులు, నిపుణులు స్పష్టంగా తెలియజేశారు. వైద్యానికి సంబంధించి రాష్ట్రాలకు గల హక్కును కూడా ఈ పథకం ద్వారా కేంద్రం హరించి వేస్తుంది. కేంద్రం ఎన్ని చెప్పినా మన దేశంలో ఆరోగ్యం ప్రాథమిక హక్కు కాదు. వాస్తవానికి ఆరోగ్యం మౌలిక మానవ హక్కుగా ఉండాలి.

దేశ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తుందని చెప్తూ ప్రధాని మోదీ సెప్టెం బరు 27న ఆర్భాటంగా జాతీయ డిజిటల్‌ ఆరోగ్య పథకాన్ని (ఎన్‌డీహెచ్‌ఎం) ప్రకటించారు. ఈ పథకం కింద ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి దాన్ని క్రోడీకరించి ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేస్తారు. ఈ సమాచారం డాక్టర్లకు, పరి శోధకులు ఆయా పరిస్థితులను విశ్లేషించేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకం పౌరులందరికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇందులో అనేక వివాదస్పదమైన అంశాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యం సమకూరుతుందా? అలాగే ప్రజల ఆరోగ్య అవసరాలను ఈ పథకం పరిష్కరిస్తుందా? రోగికి సంబంధించి రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని కాపాడుతుందా? సైబర్‌ హ్యాకింగ్‌ ద్వారా సమాచారాన్ని తస్కరించకుండా పథకం ఆపగలదా? అన్నిటికీ మించి వైద్యం రాష్ట్రస్థాయి పరిధిలో ఉన్నది. ఈ సమస్యను కొత్త పథకం ఎలా పరిష్కరిస్తుంది? ఆరోగ్య భద్రత విషయంలో అసమానతలను ఈ పథకం పట్టించుకుంటుందా?
కొత్త పథకం ద్వారా పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి రాష్ట్ర ఆరోగ్య నిర్వహణ విభాగానికి, కేంద్ర ఆరోగ్య అధికార విభాగానికి అందిస్తారు. వైద్య నైతిక విలువల ప్రకారం రోగుల ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచాలి. ఈ వివరాలు రోగులకు, డాక్టరుకు మాత్రమే తెలియాలి. డాక్టరు సైతం రోగుల అనుమతి లేకుండా మరెవరికీ సమాచారాన్ని ఇవ్వకూడదు. మూడో వ్యక్తికి సమాచారం అందిస్తే మౌలికమైన నైతికతలను పూర్తిగా ఉల్లంఘించినట్లే అవు తుంది. దేశంలో సైబర్‌ నేరాలను నియంత్రించలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ సమాచారం ఇతరులకు తెలియకుండా దాచిపెట్టేందుకు హామీ ఉంటుందా? సేకరించిన సమాచారాన్ని ఆరోగ్య పథకం కింద తన వద్ద నిలవ చేసేందుకు ఎన్‌డీహెచ్‌ఎం రోగుల అనుమతిని పొందవలసి ఉంటుంది. అలాగే రోగుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించేందుకు కూడా వారి అనుమతి అవసరం. సమాచారాన్ని సేకరించి రోగి ఆరోగ్యానికి సంబంధించిన రికార్డును భద్రపరిచిన తరవాత దాన్ని తొలగించేందుకు అవకాశం ఉండదు.
ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా ఉంచే హక్కును, సమాచార భద్రతతో పాటు పౌరుల న్యాయ హక్కులు, వారి ఆరోగ్య అవసరాల మధ్య సమతుల్యతను కాపాడేందుకు ఎంతో శ్రమ అవసరమవుతుంది. గోప్యత సూత్రాలపై సిఫారసు చేసిన నిపుణుల గ్రూపు (జస్టిస్‌ ఏపి షా కమిటీ) అలాగే జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ కమిటీ సమాచార భద్రతకు సంబంధించి చేసిన సిఫారసులు ముఖ్యమైనవి. వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు 2018 రూపొందడానికి పై కమిటీల సిఫారసులే ప్రధానమైనవి. రోగుల సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. అప్పుడు ఈ సమాచారాన్ని రహస్యంగా ఉంచా లన్న నిబంధనకు నీళ్లు వదలటమే. భద్రత అనేదే ఉండదు. ఈ పథకం కింద వ్యక్తిగత గోప్యత అనేది పూర్తిగా భ్రమే అవుతుంది. సున్నితమైన వ్యక్తిగత సమా చారం వాణిజ్యపరంగా ఉపయోగించుకోకుండా తగిన రక్షణలు ఇందులో ఏమీలేవు. అందువల్ల సమాచారం ప్రైవేటు సంస్థలకు, బీమా సంస్థలకు, ఫార్మా స్యూటికల్‌ కంపెనీలకు తదితరులకు తెలిసే అవకాశమే ఎక్కువ.
ఈ పథకం కింద క్రోడీకరించి నిల్వ చేసే సున్నితమైన సమాచారం శాశ్వ తంగా ఉంటుంది. ఆరోగ్య సమాచారంతో పాటు బ్యాంకు ఎకౌంటు నంబరు, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు వివరము, చెల్లింపు సాధనాల వివరము రోగి శారీరక, మానసిక ఆరోగ్య సమాచారం, సెక్స్‌ జీవనం, మెడికల్‌ రికార్డులు, ఆరోగ్య చరిత్ర, బయోమెట్రిక్‌ సమాచారం, జెనటిక్‌ సమాచారం, హిజ్రా స్థితి కులం, తెగ, మతం లేదా రాజకీయ విశ్వాసం లేదా రాజకీయ అనుబంధాల సమాచారం సైతం సేకరించనున్నారు. ఆరోగ్య వ్యక్తిగత సమాచారం సేకరణలో మతం, రాజ కీయ విశ్వాసం, రాజకీయ పార్టీలతో బంధం, సెక్స్‌ జీవనం తదితర రహస్య అంశాల సేకరణ ఎందుకు? ఈ సమాచారం సేకరణ అవసరం లేనేలేదు. ఉదా హరణకి ఆధార్‌ కార్డును అన్ని కార్యకలాపాలకు అనుసంధానించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఉన్న సమాచారం ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. దేశ ప్రజల కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. క్రమంగా ఆయుష్మాన్‌ భారత్‌, సీజీహెచ్‌ఎస్‌, ఈసీహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐ లేదా ప్రభుత్వం సహాయం చేసే ఇతర కార్యకలాపాలకు, బీమా కంపెనీలకు సైతం అనుసంధానించమని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యానికి సంబంధించిన విధానాలను మెరుగుపరుచుకొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్న కేంద్రం వాదన ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. దేశ ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి తెలియనివేమీ కాదు. అయితే వీటి పరిష్కారానికి రాజకీయ సంకల్పమే అవసరం. ఆరోగ్య భద్రతా వ్యవస్థను ఎలా మెరుగుపరచాలన్న అంశాలను అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజ గ్రూపులు, నిపుణులు స్పష్టంగా తెలియజేశారు. వైద్యానికి సంబం ధించి రాష్ట్రాలకు గల హక్కును కూడా ఈ పథకం ద్వారా కేంద్రం హరించి వేస్తుంది. కేంద్రం ఎన్ని చెప్పినా మన దేశంలో ఆరోగ్యం ప్రాథమిక హక్కు కాదు. వాస్తవానికి ఆరోగ్యం మౌలిక మానవ హక్కుగా ఉండాలి. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే రక్షిత మంచినీరు సరఫరా, మురుగునీటిని శుభ్రపరిచే సౌకర్యాలు, స్వచ్ఛమైన గాలి, పౌష్ఠికాహారం, పనిచేసే చోట మంచి వాతావరణం, ఉద్యోగ హామీ, తగినంత వేతనం మొదలైనవి ఎంతో ముఖ్యమైన అంశాలు. ఆరోగ్య భద్రతకు పైన తెలిపిన అంశాల అమలుకు ప్రాధాన్యమివ్వాలి. ఈ అంశాల అమలుకు ముందుగానే తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి.
ప్రజలు వైద్య చికిత్సల కోసం మోయలేని భారం మోస్తున్నారు. ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేయటం వలన 6.3 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని జాతీయ ఆరోగ్య విధాన నివేదిక స్పష్టంగా అంగీకరించింది. ప్రజారోగ్య రంగానికి జీడీపీలో కనీసం అయిదు శాతం ఖర్చు చేయాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేసినప్పటికీ ప్రభుత్వం కేవలం ఒక్క శాతం మాత్రమే ఖర్చు చేయటం అత్యంత విచారం. ఇక రోగులు అధికంగా ఖర్చు చేయవలసిన అవసరం ఏర్పడిరది. ప్రైవేటు రంగం దయాదాక్షిణ్యాలకు రోగులను ప్రభుత్వం వదిలేసింది. ప్రైవేటు రంగం 80శాతం ఆరోగ్య రంగంలో ఉన్నది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో రోగులను కార్పొరేట్‌ వైద్యరంగం ఎలా దోచుకొన్నది రహస్యమేమీ కాదు. సార్వత్రిక ఆరోగ్య భద్రతా వ్యవస్థ ఒక్కటే పరిష్కారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img