Friday, April 19, 2024
Friday, April 19, 2024

అమెరికా – భారత్‌ మధ్య రాకపోకల పునరుద్ధరణ

ఆరు విమానాలు నడిపిన ఎయిర్‌ ఇండియా – బోయింగ్‌ హామీతోనే బీ777 సేవలు
న్యూదిల్లీ :అమెరికా-భారత్‌ మధ్య ఆరు విమాన సేవలను పునరుద్ధరించినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. బోయింగ్‌ బీ777 విమానాన్ని గురువారం నడిపింది. ఆ సంస్థ నుంచి హామీ రావడంతో ఈ సేవలను పునరుద్ధరించింది. బుధవారం నుంచి ఉత్తర అమెరికాలో 5జీ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో అల్టీమీటర్లకు 5జీ తరంగాలతో ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఎనిమిది విమాన సేవలను రద్దు చేసింది. బీ777 వంటి కొన్ని రకాల విమానాల్లోని రేడియో అల్టీమీటర్లకు 5జీ సేవల వల్ల ఎలాంటి సమస్య ఉండదని అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ( ఎఫ్‌ఏఏ) తాజా ప్రకటనలో వెల్లడిరచింది. బోయింగ్‌ కూడా తమ విమానాలు నడపవచ్చు అని చెప్పడంతో బీ777 సేవలను పునరుద్ధరించినట్లు ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. మొట్టమొదటి న్యూయార్క్‌లోని జేఎఫ్‌కేకు విమానం బయల్దేరి వెళ్లింది. ఆపై చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కోకు విమానాలు వెళ్లాయని చెప్పారు. బుధవారం విమానాలు రద్దు కావడంతో ఇక్కడే చిక్కుకున్న ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు వెల్లడిరచారు. అమెరికాకు బీ777 విమానం ప్రయాణానికి సంబంధించిన అంశం పరిష్కారమైందన్నారు. గురువారం దిల్లీన్యూయార్క్‌, న్యూయార్క్‌దిల్లీÑ దిల్లీచికాగో, చికాగోదిల్లీ, దిల్లీశాన్‌ఫ్రాన్సిస్కో,శాన్‌ఫ్రాన్సిస్కోదిల్లీ విమానాలతో పాటు బుధవారం రద్దు అయిన ముంబైనెవార్క్‌Ñ నెవార్క్‌ముంబై విమానాలు రాకపోకలు సాగించినట్లు అధికారి వెల్లడిరచారు. అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల పరిసరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు ఆ దేశానికి వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. ఎయిర్‌ ఇండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేదు. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఒప్పందాన్ని దక్కించుకున్నాయి. వాస్తవానికి అమెరికాలో 5జీ సేవలు 2021, డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దాదాపు నెల ఆలస్యంగా అవి అందుబాటులోకి వచ్చాయి. ఇదిలావుంటే, విమానాల్లో ఉండే సున్నితమైన ఆల్టీమీటర్లను 5జీ సేవలు ప్రభావితం చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే విమానసేవలను ఎయిర్‌ ఇండియా నిలిపివేసింది. అయితే బోయింగ్‌ 717, 737,747, 757, 767, 777 విమానాల్లోని అల్టీమీటర్లపై 5జీ ప్రభావం పెద్దగా ఉండదని ఎఫ్‌ఏఏ పేర్కొంది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా మాత్రమే ప్రసుతం రెండు దేశాల మధ్య విమానాలు నడుపుతున్నాయి. ఎయిర్‌ ఇండియా మినహా మిగతా రెండు వైమానిక సంస్థలు తమ విమాన సేవలపై 5జీ ప్రభావం మీద ఏ ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img