Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదు : సుప్రీంకోర్టు

ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టంచేసింది. ఓబిసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల చట్టబద్ధతను సవాలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ చంద్రచూడ్‌ , జస్టిస్‌ బోపన్న ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 (4) (5) సమానత్వపు హక్కుకు వాస్తవిక కోణాలు ఉన్నాయని పేర్కొంది. పోటీ పరీక్షలు అనేవి సామాజిక ఆర్థిక బలమైన వర్గాలు పొందుతున్న ప్రయోజనాలను చూపదని వెల్లడిరచింది. దీనికి మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదన్నారు.కాగా ఇటీవల నీట్‌ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌లకు సుప్రీంకోర్టు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్‌ ఆధారంగా అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పును ఇచ్చారు. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు జారీ చేసింది.2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img