Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేరళలో 63 కొత్త ఒమిక్రాన్‌ కేసులు

తిరువనంతపురం: కేరళలో మంగళవారం 63 కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 591కి చేరాయి. 63 కొత్తకేసుల్లో నలుగురు తమిళనాడుకు చెందిన వారు కాగా మిగతా వారు వివిధ దేశాల నుంచి కేరళకు వచ్చిన వారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ‘ఈ రోజు వైరస్‌ సోకిన వారిలో 36 మంది తక్కువ-ప్రమాదకర దేశాల నుండి, తొమ్మిది మంది అధిక-ప్రమాదకర దేశాల నుండి వచ్చారు. తొమ్మిది మంది ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి చేరుకున్నారు. తొమ్మిది మంది వారి కాంటాక్ట్‌ల ద్వారా వ్యాధి బారిన పడ్డారు’ అని జార్జ్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఒమిక్రాన్‌ ధృవీకరించబడ్డవారిలో ఆరుగురు కళాశాల విద్యార్థులు. వీరు విహారయాత్రకు వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు మొత్తం 591 ఒమిక్రాన్‌ రోగులలో, 401 మంది తక్కువ-ప్రమాదకర దేశాల నుండి వచ్చినవారు కాగా, 101 మంది అత్యంత ప్రమాదకర దేశాల నుండి వచ్చారు. రాష్ట్రంలో మొత్తం 70 మందికి వీరి పరిచయాల ద్వారా వ్యాధి సోకిందని, 19 మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చారని ప్రకటన వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img