Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ నేతలు, సినిమా వాళ్ళు పరస్పర దూషణలు చేసుకోవడం సరికాదు: రామకృష్ణ

వైసీపీ నేతలు, సినిమా వాళ్ళు పరస్పర దూషణలు చేసుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తులతో విడివిడిగా కాకుండా మూవీ ఆర్టిస్ట్స్‌ డైరెక్టర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్లు, థియేటర్ల యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపితేనే ఫలితం ఉంటుందన్నారు. సినిమా టికెట్ల ధరలు తగ్గింపుపై దృష్టి పెట్టిన విధంగానే సిమెంటు, ఇసుక, స్టీల్‌, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపై సీఎం దృష్టిపెట్టాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img