Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దు : మంత్రి హరీష్‌రావు

ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువ.. తీవ్రత తక్కువ.. ఒకవేళ అది వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. మనకు ఈ రెండు మూడు వారాలు చాలా కీలకమని, అందరూ మాస్క్‌ లను ధరించాలని సూచించారు. వందశాతం సెకండ్‌ డోసు పూర్తి చేయాలన్నారు. బాలానగర్‌లోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, ఒమిక్రాన్‌ బారినపడితే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని, మీ ఏఎన్‌ఎం లతోనే మెడిసిన్‌ కిట్స్‌ ఉన్నాయి.. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే.. వాళ్లే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తారని చెప్పారు. అన్ని రకాల మందులు ఉన్నాయని వివరించారు. 15 సంవత్సారాలు దాటిన ప్రతి ఒక్కరికీ వాక్సిన్‌ వేయించండి..60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోస్‌ వేసుకోండని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img