Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మృతుల్లో టీకా తీసుకోని వేరే అధికం

దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడి
న్యూదిల్లీ: కరోనాకు దిల్లీలో మరణించిన వారిలో 75శాతం మంది వాక్సిన్‌ వేయించుకోని వారేనని దిల్లీ ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్‌ చెప్పారు. శుక్రవారం నగరంలో 25 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. దిల్లీలో గురువారం 28,867 కేసులు నమోదైనట్లు వెల్లడిరచారు. కరోనా ప్రారంభమైన తర్వాత ఇంత పెద్దమొత్తంలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ 20న ఒకే రోజు 28,395 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ డేటా తెలిపింది. జనవరి 9 నుంచి 12వ తేదీవరకు కరోనాతో మొత్తం 97 మంది మృతిచెందగా అందులో 70మంది టీకాలు తీసుకోని వారేనని అధికారిక డేటా వెల్లడిరచింది. 19 మంది ఒక డోసు వేసుకున్నారని, 8 మంది రెండు డోసులు వేసుకున్నారని, మరో ఏడుగురు చిన్న పిల్లలని వివరించింది. మృతుల్లో 75శాతం మంది ఒక్క డోసు వాక్సిన్‌ కూడా తీసుకోలేదని, 90శాతం మంది క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏడుగురు 18 ఏళ్ల లోపు వయసు గల వారు ఉన్నారని మంత్రి జైన్‌ వివరించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
కేసులు పెరిగినా భయం లేదు:కేజ్రీవాల్‌
దిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని, కానీ ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు చాలా తక్కువని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రజలంతా బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఆసుపత్రుల్లో చాలినన్ని పడకలు ఉన్నాయని కేజ్రీవాల్‌ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన విలేకరులకు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img