Friday, April 19, 2024
Friday, April 19, 2024

రెండో డోసు, ప్రికాషన్‌ డోసుల మధ్య గడువు తగ్గించండి

కేంద్రానికి హరీశ్‌రావు లేఖ
కరోనా సెకండ్‌ డోసు, ప్రికాషన్‌ (బూస్టర్‌ డోసు) మధ్య ఉన్న గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాశారు. హెల్త్‌ కేర్‌ వర్కర్లకు సంబంధించి రెండో డోసు, ప్రికాషన్‌ డోసు మధ్య గడువును మూడు నెలలకు కుదించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మూడో డోసు ఇవ్వాలన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడికి సైతం బూస్టర్‌ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలు అమలుచేస్తున్న బూస్టర్‌ డోసు టీకా పాలసీ, ఫలితాల ఆధారంగా తాము ఈ ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వాటి ఆధారంగా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img