Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇక జార్ఖండ్‌ మీదే బీజేపీ గురి

రాష్ట్రాలతో సహా దేశమంతటా తమ ఏకచ్ఛత్రాధిపత్యమే కొన సాగాలన్నది బీజేపీ ఆకాంక్ష. అందుకే ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ఒక్కో రాష్ట్రంలో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బీజేపీ నిమ గ్నమై ఉంది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్‌ అగాధీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అన్ని రకాల అక్రమ మార్గాలు అనుసరించిన బీజేపీ ఇప్పుడు జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని అస్థిరీ కరించే పనిలో పడిరది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ప్రతిపక్షాల ఐక్యతను కాదని రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. జార్ఖండ్‌లో అసలు కుట్ర నిజస్వరూపం బయటపడలేదు కాని ఏదో జరుగుతోందని మాత్రం స్పష్టం గానే కనిపిస్తోంది. హేమంత్‌ సొరేన్‌ను ఇరుకున పెట్టడానికి బీజేపీ తనకు బాగా అలవాటైన కుయుక్తులన్నింటినీ ప్రయోగిస్తోంది. ఏదో ఓ మాయో పాయంతో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట ఆ ప్రభుత్వాలను కూల్చేసే పనిలో బీజేపీ ఉంది. జార్ఖండ్‌, రాజస్థాన్‌లో ప్రభుత్వాలను అస్థిరీక రించడానికి వ్యూహాలు పన్నుతోంది. స్వతంత్రంగా వ్యవహరించవలసిన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలను ఇదివరకే మోదీ సర్కారు గుప్పెట్లో పెట్టుకుంది. తమకు కిట్టని నాయకుల మీద సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొ రేట్‌, ఆదాయపు పన్ను శాఖను ఉసిగొల్పడం కొనసాగుతూనే ఉంది. జార్ఖండ్‌లో మాత్రం సొరేన్‌ ప్రభుత్వానికి పొగబెట్టడానికి ఎన్నికల కమిషన్‌నే ఉసి గొల్పుతోంది. దానికి తోడు సొరేన్‌ అధీనంలో పనిచేసే అధికారుల మీద ఈ పాటికే గనుల కేటాయింపు అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఒక అధికారిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఆయన దగ్గర రూ. 19 కోట్లు పట్టుబడ్డాయంటున్నారు. ముందు అధికారుల మీద గురిపెట్టి హేమంత్‌ సొరేన్‌కు ఊపిరి సలపకుండా చేయాలన్న వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. హేమంత్‌ సొరేన్‌ గనుల తవ్వకానికి తనకు తానే అనుమతి ఇచ్చుకున్నాడన్న ఆరోపణ ఉంది. ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ గనుల తవ్వకం విషయంలో అధికారుల మీద కూడా గురి పెట్టింది. జార్ఖండ్‌లో మాత్రమే కాకుండా పొరుగున ఉన్న బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలలో కూడా దాడులు కొనసాగాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణ కూడా హేమంత్‌ సొరేన్‌ మీద మోపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ దాడులు జరిగిన వెంటనే దాడులకు గురైన వారి దగ్గర ఏమేం దొరికాయో ఆ విభాగం అధికారులు వెల్లడిరచడానికి ముందే బీజేపీ నాయ కులు పూసగుచ్చినట్టు ఏమేం జరిగిందో మీడియా వారికి వివరించడం పరిపాటి అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టొరేట్‌ ముఖ్యమంత్రి సొరేన్‌ బంధువుల, ఒక శాసనసభ్యుడి ఇంటిమీద జరిపిన దాడుల వివరాలను బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే పొల్లుబోకుండా వివరించారు. అంటే ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ తమ పని విధానం గురించి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు వివరించడం మానేసి స్థానిక బీజేపీ నాయకులకు సకల వివరాలూ తెలియజేస్తున్నట్టుగా ఉంది. హేమంత్‌ సొరేన్‌ గనుల శాఖను నిర్వ హిస్తున్నారు కనక గనుల తవ్వకానికి తనకు తానే అనుమతి మంజూరు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికో లేదా ప్రతిపక్షంలో బలమైన నాయకులో, వారికి అనువైనవారో ఉన్నారనుకుంటే వారి మీద సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌, ఆదాయపు పన్ను శాఖ చేత దాడులు చేయించి బెదరగొట్టడం ఇటీవలి కాలంలో వీపరీతంగా పెరిగిపోయింది. ఈ దాడులకు గురైన వారిలో చాలామంది ఎందుకొచ్చిన గొడవ అని బీజేపీలో చేరిపోతున్నారు. అవినీతో, మరో రకమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు ఈ రచ్చ నుంచి బయట పడడానికి బీజేపీలో చేరి పవిత్ర గంగా స్నానం చేసి పునీతులవుతున్నారు. అలాంటి వారి మీద ఠక్కున దాడులు ఆగి పోవడం చూస్తే తమ అధీనంలోని రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కారు ఎలా దుర్వినియోగం చేస్తోందో స్పష్టం అవుతోంది. ఇలా ఒత్తిడి తీసుకొచ్చి నందువల్లే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అదేమంటే తమది గిరిజనులు ఎక్కువగా ఉండే రాష్ట్రం అనీ ముర్ము గిరిజనురాలు కనక మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు నమ్మబలుకుతున్నారు. విచిత్రం ఏమిటంటే జార్ఖండ్‌లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ (ఎం.ఎల్‌.) లిబరేషన్‌తో సహా మరి కొన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ఐక్య సంఘటనకు నాయకుడు హేమంత్‌ సొరేనే. కానీ ఆయన ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. ఈ ఐక్య సంఘటన 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏర్పడిరది. 2024 ఎన్నికల నాటికి ప్రతిపక్షాల ఐక్య సంఘటనను భగ్నం చేయడానికి సొరేన్‌ కనక సహకరిస్తే ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగడానికి బీజేపీ అధినాయకత్వ ఆశీస్సులు ఉంటాయి లేదా బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అవసరమైతే హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వాన్ని అస్థిరీకరించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే 81 మంది శాసనసభ్యులున్న జార్ఖండ్‌లో జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు 30 స్థానాలే ఉన్నాయి. బీజేపీ సభ్యులు 25 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మహా సంఘటనకు 51 మంది సభ్యుల మద్దతు ఉంటే ఎన్‌.డి.ఎ.కు 30 మంది మద్దతు ఉంది. మహా సంఘటన విచ్ఛిన్న మైతే సొరేన్‌ నిలబడలేరు. అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తే అధికారం బీజేపీ గుప్పెట్లో ఉన్నట్టే. జార్ఖండ్‌లో 14 లోకసభ స్థానాలు ఉంటే బీజేపీకి 11 మంది సభ్యులున్నారు. మహా కూటమిని ధ్వంసం చేయగలిగితే 2024 ఎన్నికలలో మొత్తం 14 సీట్లూ బీజేపీ ఖాతాలో పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. అధికారం సంపాదించడానికి అనుసరించే పద్ధతి నైతికమా, అనైతికమా అన్న పట్టింపు బీజేపీకి ఎటూ లేదు. అందువల్ల బీజేపీ ఇక జార్ఖండ్‌ మీద గురి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ లేని చోట్ల కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో బీజేపీ అసమానమైన నైపుణ్యం సాధించింది. అందు కోసం ఎలాంటి మార్గం అనుసరిస్తాం అన్న దానితో బీజేపీకి పేచీయే లేదు. అనుసరించే మార్గం కన్నా అధికారం సంపా దించడమే ప్రధానం. కర్నాటక, మధ్యప్రదేశ్‌, గోవా లాంటి చోట్ల అనుస రించిన పద్ధతి అనుసరించడానికి బీజేపీ ఎన్నడూ వెనుకాడదు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని నినదించిన బీజేపీ ఇప్పుడు అసలు ప్రతిపక్షమే లేకుండా చేయడం మీదే దృష్టి కేంద్రీకరించింది. దానికి ఎన్ని అడ్డదార్లైనా తొక్కడానికి సిద్ధమే. రాజ్యాంగాన్ని కాలరాసే ప్రక్రియలో ఇప్పటికే నైపుణ్యం సంపాదించింది కనక ఇక ఎదురేముంటుంది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img