- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మండల పరిధిలోని 13 ఎంపీటీసీలకు గాను 29 మంది ఎంపీటీసీలను తుది జాబితాలో అధికార పూర్వకంగా ప్రకటించడం జరిగిందని ఎంపీడీవో వెంకటేశు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అక్టోబర్ 27వ తేదీ ఉపసంహరణ కార్యక్రమంలో 35 మంది ఉపసంహరించుకోవడం జరిగిందని వారు తెలిపారు. మొత్తం తుది జాబితాలో పార్టీల వారీగా వెళితే వైఎస్ఆర్సిపి 13 మంది, టిడిపి 11 మంది, జనసేన పార్టీ ఇద్దరూ, బిజెపి ఒకరు, కాంగ్రెస్ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు వెరసి 29 మంది తుది జాబితాలో ఉన్నారని తెలిపారు.


