Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, వాచ్‌మెన్లకు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, వాచ్‌మెన్లకు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి



ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము నగరపాలక సంస్థలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు అవసరానికి తగ్గట్టుగా పనిమూట్లు ఇవ్వాలన్నారు,చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకొని వారికి రావాల్సిన ఈ పి ఎఫ్ ,ఈ ఎస్ ఐ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు తక్కువ ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు పోయిన ప్రభుత్వం నిలుపుదల చేసింది ఈ ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు బకాయి ఉన్న 2011 సం,,లోని 9 నెలల ఈ పి ఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమచేయాలన్నారు, మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న స్వీపర్లుడవాచ్మెన్ల కు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే ఇస్తూ నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వేతనాలు జమచేయాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించారని లేనిపక్షంలో ఉద్యమానికి శ్రీకారంచుడతామన్నారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,Aూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి, నాయకులు వేణుగోపాల్,రఫీ,అసేన్,లక్ష్మిదేవి,తిమ్మప్ప,నారాయణస్మామి,సాయి తదితరులు పాల్గొన్నారుౌ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు