Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పిఎం కేర్స్‌ నిధి అంతా రహస్యమే

సుశీల్‌ కుట్టి

ప్రజలు తెలివితక్కువ వాళ్లనే భావన ప్రభుత్వ పెద్దలకు ఉందని పిస్తోంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పిఎం కేర్స్‌ నిధి పేరుతో చేసే వసూళ్ల రహస్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రజల సంక్షేమం పేరుతో ఈ నిధులు సమీకరిస్తున్నారు. రహస్య మార్గాల నుండే కాకుండా ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, వివిధ ఏజెన్సీల ద్వారా కూడా నిధులు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో దాగుడు మూతలు ఆడుతూనే ఉంది. నిధుల సేకరణ మార్గాలను, సేక రించిన మొత్తాలను వెల్లడిరచేందుకు ప్రభుత్వం తిరస్కరించింది. ప్రజల సంక్షేమం పేరుతో వసూలు చేసే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కాని, ప్రధాని కార్యాలయం కాని ప్రజలకు లేదా కోర్టులకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడిరచటం లేదు. ప్రధాని పౌర సహాయ, ఊరట అత్యవసర పరిస్థితి నిధి (పిఎం కేర్స్‌ నిధి) అని పేరు పెట్టారు. అయితే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానివి కాదని చెప్తున్నారు. అలాంటప్పుడు పిఎం కేర్స్‌ నిధి అని ఎందుకు పేరు పెట్టారు? ఎవరి సలహా మీద ఈ పేరు పెట్టారు. ఈ నిధులకు లెక్కా పత్రం ఏమీ ఉండదా? అత్యంత భారీగా నిధులను ఎలా సేకరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాని కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం ప్రజలతో ఆటలాడటం ఆపివేయాలి.
పారదర్శకత, జవాబుదారీతనం లేని ఈ నిధులపై ఎవరూ మాట్లా డటం లేదు. ఈ నిధికి ప్రధాని ఎక్స్‌అఫిషియో చైర్మన్‌గా ఉన్నారు. పైగా పిఎం కేర్స్‌ నిధి అని పేరు పెట్టారు. ముగ్గురు మంత్రులు ట్రస్టీలుగా ఉన్నారు. పిఎం కేర్స్‌ నిధిని ప్రభుత్వానికి చెందినదిగా, ప్రభుత్వ సంస్థగా సమాచార హక్కు చట్టం కింద ప్రకటించాలని దిల్లీ హైకోర్టులో ఒకరు పిటీషన్‌ వేశారు. కొవిడ్‌`19 మహమ్మారి నియంత్రణ కోసమని చెప్పి 2020 మార్చిలో పిఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేశారు. విరాళాల ద్వారా ఈ నిధికి లెక్కకు మిక్కిలి లక్షలను వసూలు చేశారు. ఎక్కడా పారదర్శకత కనిపించదు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోరు. ఆర్టీఐ చట్టం కింద ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని అనేక మంది వేసిన పిటీషన్లను కోర్టు ఏవో కారణాలపై తిరస్కరించింది. ఈ వ్యవహారంపై ప్రధాని నోరు మెదపరెందుకని? ఇందుకు సంబంధించిన ఏ విషయాన్నీ వివరించటం లేదు. వసూలు చేసిన అపారమైన నిధులకు చట్టబద్దతను సవాలు చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు అయింది. ప్రతిరోజూ విరాళాల ద్వారా వసూలు చేసే నిధులను పక్కదారి మళ్లిస్తున్నారు. వాస్తవంగా ఈ నిధి జల రాక్షసి వంటిది. ఎన్ని నిధులనైనా అది తన పొట్టలోనే ఇముడ్చుకుంటుంది. ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఈ నిధుల వ్యవహారం భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ విధ్వంసం లాంటిది.
వాస్తవంగా పిఎం కేర్స్‌ నిధి అపారంగా డబ్బును పోగుచేసి దాచిన సంస్థ. నిధులు ఎన్నని ఊహించటానికి కూడా వీలు లేదు. నిరంత రాయంగా ఈ నిధికి డబ్బు సమకూరుతూనే ఉంది. బహుశా ఈ నిధికి ఎంత వసూలు అయిందన్న వాస్తవం అసలు బయటపడకపోవచ్చు. ఎందుకంటే ఎంతమాత్రం పారదర్శకత లేదు. ఈ విషయంలో ప్రజా స్వామ్య భావనలకు తావే లేదు. సుప్రీంకోర్టు నుంచి వివరణ కోసం అనేక మంది యువ న్యాయవాదులు పిటీషన్‌ దాఖలు చేశారు. సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలని అందులో వారు కోరారు. పైగా ఇది చారిటబుల్‌ ట్రస్టు అంటూ ప్రభుత్వం హైకోర్టుకి తెలియజేసింది. రాజ్యాంగానికిగాని, పార్లమెంటుకి గాని లేదా రాష్ట్ర అసెంబ్లీకి గాని దీనితో సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే వ్యక్తులను లేదా సంస్థలను ఎలా ఆపుతామని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ కేసు దిల్లీ హైకోర్టులో ఈ నెల 27వ తేదీన విచారణకు వస్తుంది. అప్పుడైనా దీని వెనుక మర్మమేమిటో వెల్లడవుతుందా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img