Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ట్యునీషియాలో రాజకీయ సంక్షోభం

టునిస్‌: ఆఫ్రికా ఉత్తరప్రాంత దేశమైన ట్యునీషియాలో రాజకీయ సంక్షోభం దేశవ్యాప్త ఆందోళనకు దారితీసింది. అధ్యక్షుడు కైస్‌ నయిద్‌ ఉత్తర్వులను నిరసిస్తూ వందలాదిమంది టునిస్‌లో ఆందోళన చేపట్టారు. కైస్‌ తనను తాను అధ్యక్షు డుగా ప్రకటించుకోవడం, పార్లమెంటు రద్దు ఉత్తర్వులను నిరసిస్తూ ప్రజలు పెద్తఎత్తున ఆందోళన చేపట్టారు. సభ్యుల అధికారాలను నిలిపివేయడంతోపాటు వారి జీతాలను ఆపి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జులైలో ఎమర్జెన్సీపేరుతో కైస్‌ దేశ ప్రధానిని తొలగించడం, పార్లమెంటు రద్దు సంగతి తెలిసిందే..దేశ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, పార్లమెంటును గౌరవించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సుమారు 100కిపైగా ఎన్నహ్దా పార్టీ అధికారులు తమ రాజీనామాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img