Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎందుకింత నిర్లక్ష్యం ?

కోర్టు ఆదేశాలంటే గౌరవం లేదా ?
ఏపీ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

అమరావతి : ఉపాధిహామీ బిల్లుల చెల్లింపుల వ్యవహా రంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యంపై బుధవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. గంట న్నర పాటు జరిగిన విచారణలో ప్రభుత్వాధికా రులు అనేక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల మాటలు విన్న హైకోర్టు…బిల్లుల చెల్లింపులో ఆలస్యంపై ఆగ్రహం వెలిబుచ్చింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని, కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే రూ.413 కోట్లు చెల్లించామని, నాలుగు వారాల్లో మరో రూ.1,117 కోట్లు చెల్లించనున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం రూ.1794 కోట్ల బిల్లులకుగాను రూ.40కోట్లు మాత్రమే చెల్లించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం..ఏ గ్రామపంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సహా పూర్తి అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. ప్రతి బిల్లులో 20శాతం ఎందుకు మినహాయిస్తున్నారు. ఆ మినహాయించిన డబ్బును ఎక్కడ ఉంచుతున్నారు? అసలు ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని ధర్మాసనం మండిపడిరది. ఈ బిల్లులపై విజిలెన్స్‌ విచారణలో ఏం తేలిందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేదీని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన దీనిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత విషయాలు తెలుసుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఈ కేసులో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు హాజరు కాలేదని నిలదీసింది. ప్రతిసారి కుంటిసాకులు చెప్పడం సరికాదని మందలించింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలని, లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img