సుప్రీంకోర్టులో సిఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. బెయిల్‌పై హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాలని సుప్రీం కోర్టు తెల్చి చెప్పింది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సిఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు బెయిల్‌పై హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాలని తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఎల్లుండి విచారిస్తామని తెలిపింది.