Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఆరుద్రకు రూ.5లక్షల సాయం అందజేత

కుమార్తెకు నెలకు రూ.10వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు అవసరమైన చికిత్స కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాకులో అధికారులు ఆరుద్రకు చెక్కు రూపంలో సాయం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని.. తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆరుద్ర.
గత‌ ప్రభుత్వ హయాంలో సాయం అందిస్తామని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు ఆరుద్ర. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారని.. తన కుమార్తె వైద్యానికి రూ.5లక్షలు ఇస్తానని చెప్పి హామీని నిలబెట్టుకున్నారన్నారు. ఆ మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును అధికారులు తనకు అందజేశారన్నారు. తన బిడ్డకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. తమను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి దీవెనల వల్లే తన కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉందన్నారు ఆరుద్ర. తమను ఇబ్బందిపెట్టినవారిపై అన్నవరం, అమలాపురం, కాకినాడలలో కేసులు నమోదుచేయాలని.. పోలీసుల మీద ప్రత్యేక కమిషన్‌ వేసి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అలాగే కోర్టు కేసులు కొట్టించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు. తమను ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారిపై, తాము అప్పుల పాలవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఆరుద్ర. ఆస్తి చేతికి అందక, కుమార్తె వైద్యానికి ఇబ్బంది పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరుద్ర కుమార్తె లక్ష్మితో కలిసి ఈ నెల 14న అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఆరుద్ర కుమార్తెకు రూ.10వేల పింఛనుతో పాటుగా వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆరుద్ర ఆస్తి వివాదాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముందు వరకు ఆరుద్ర తన కుమార్తెతో కలిసి వారణాసిలో ఉన్నారు.. ఆ తర్వాత ఏపీకి తిరిగొచ్చి చంద్రబాబును కలిశారు.

కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతున్నారు. ఆమె కుమార్తె వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించగా.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో ఆమెతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చినా.. అప్పటి సీఎం జగన్‌ను కలిసే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె సీఎం క్యాంపు ఆఫీసు వద్దే ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆస్తి వివాదంలో గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img