విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : ఆర్.బి.ఐ. మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్ పే , జి పే, పేటిఎం మరియు ఇతర యూపిఐ యాప్స్ నందు మీరు విద్యుత్ బిల్లులు చెల్లించుటకు మా ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్. డిస్కామ్ పేరు కనిపించదని విద్యుత్ శాఖ అధికారులు ఓ అధికారిక ప్రకటన చేసారు. కాబట్టి ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్. కన్స్యూమర్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ (https://play.google.com/store/apps/details?id=com.apepdcl.easternpower&hl=en) నుంచి డౌన్లోడ్ చేసికొని గాని లేదా విద్యుత్ డిస్కామ్ వెబ్సైటు https://www.apeasternpower.com నుంచి గాని బిల్లులు చెల్లించ వలెను. మా ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్. యాప్ లో గాని లేదా విద్యుత్ డిస్కామ్ వెబ్సైటు లోగాని మీరు బిల్లులు చెల్లించు నప్పుడు మీరు మీ ఫోన్ పే, జి పే, పే టి ఎం., లేదా ఇతర యూపిఐ వాడవచ్చు. అలాగే మీరు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాల్లెట్స్, కాష్ కార్డ్స్ కూడా వాడవచ్చునని తెలియజేసారు.