విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా): తే.02.07.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవలందిస్తున్న వైద్యులను సత్కరించుకోవడం మన బాధ్యతగా భావించాలని చోడవరం లయన్స్ క్లబ్ ప్రారంభకులు డాక్టర్ అధికారి గోపాలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనందరికీ ఎన్నో సంవత్సరాలుగా సుపరిచితులైన వైద్యులందరినీ ఒకేసారి చూడడం ఆనందాన్ని ఇచ్చిందని, దీన్నొక అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చోడవరం డాక్టర్స్ అసోసియేషన్ కు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కేవలం డాక్టర్స్ డే నాడే కాకుండా ప్రతీ రోజూ ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య వృత్తి చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న వైద్యలందరను గౌరవించాలని అన్నారు. ఎందుకంటే వైద్యుల సేవలు అద్వితీయమని, అమూల్యమైనవి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డా.యక్కల రామకృష్ణ,
డా.నీలం నాగేంద్రబాబు, డా.రాజేష్, డా. శకుంతలరావు, డా.రంగనాయకులు, డా. హరిబాబుగారు, డా.పవన్ సంతోష్, లయ న్స్ క్లబ్ సభ్యులు
పసుమర్తి సాంబశివరావు, వర్జుల రమణ మూర్తి (వాణి ప్రెస్ బాబు),
బుజ్జి రెడ్డి,
గనిరెడ్డి,
ముక్కా రమేష్,
వేపాడ సత్యనారాయణ,
పసుమర్తి చందు,
ఉప్పల కృష్ణాజి,
ఎస్.ఎస్.ఎస్.షాపింగ్ మాల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.