Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

గుండె పరిరక్షణ అవగాహన ర్యాలీ, సదస్సు

ఆసుపత్రి ఎం.డి డాక్టర్ కొడాలి తిరుమల ప్రసాద్
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 29న పట్టణంలో గుండె పరిరక్షణ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహిస్తున్నామని ఆసుపత్రి ఎం.డి డాక్టర్ కొడాలి తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండె పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ, సదస్సు ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కోట వద్ద జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నగర్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ప్రారంభిస్తారని తెలిపారు. కోట వద్ద ప్రారంభమైన ర్యాలీ మూడు లాంతర్లు, గంట స్తంభం, బాలాజీ జంక్షన్ మీదుగా తిరుమల మెడికవర్ ఆసుపత్రి కి చెరుకుంటుందని వివరించారు. అనంతరం ఆసుపత్రి సెమినార్ హాల్లో గుండె సమస్యలపై ప్రత్యేక వైద్యులతో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వయో శ్రేష్ఠులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అదేరోజు ఆసుపత్రిలో ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలను మొదటగా పేరు నమోదు చేసుకున్న 100 మందికి ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ ఏ శరత్ కుమార్ పాత్ర, డాక్టర్ బి రవికుమార్, డాక్టర్ జి.వాసుబాబు, డాక్టర్ ఆర్.వి.దుర్గాప్రసాద్, ఆసుపత్రి సెంటర్ హెడ్ ఎన్.మల్లిఖార్జునరావు, డాక్టర్ భట్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img