.ఆర్ వి నగర్ వైద్యాధికారి రాజా రవీంద్రనాథ్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – వాతావరణం మార్పుల వల్ల కలిగే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ వి నగర్ వైద్యాధికారి రాజా రవీంద్రనాథ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల వలన దగ్గు, జలుబు, పడిశం, వైరల్ జ్వరాలతో కూడిన ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన వీటి నుండి రక్షణ పొందవచ్చు అన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగడంతో పాటు, వేడి పదార్థాలను మాత్రమే భుజించాలి అన్నారు. చల్లని నీళ్లు, పానీయాలు, చల్లని తిండి పదార్థాలు తీసుకోవడం తగ్గించాలన్నారు. వీటితోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. వాతావరణ మార్పుల వలన కలిగే రుగ్మతల నుండి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. రుగ్మతలు ప్రబలిన వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.