Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

డివిజనల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు

అటవీ శాఖ డివిజనల్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ. చేసిన డీ ఎఫ్ ఓ సూర్య నారాయణ.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నూతనంగా ఏర్పడిన అల్లూరి జిల్లా లోని చింతపల్లి సబ్ డివిజన్ లో అటవీ శాఖ డివిజనల్ కార్యాలయ భవన నిర్మాణానికి ఆ శాఖ ఉన్నత అధికారులు 90 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడంతో ఆ శాఖ డీ ఎఫ్ ఓ సీ హెచ్ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి సాయి పంతులు సమక్షంలో భవన నిర్మాణానికి వేద మంత్రము ల సాక్షిగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజనల్ కేంద్రమైన చింతపల్లి లో నూతన భవన నిర్మాణానికి తమ శాఖ ఉన్నత అధికారులు నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఆ నిధులతో నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంబిస్తామన్నారు. ప్రస్తుతం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img