ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు విజయ భారతి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వా డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్రపటానికి అధ్యాపకులతో కలిసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాలలో కంప్యూటర్ అధ్యాపకురాలుగా విధులలో చేరి మూడేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అధ్యాపకులు లీలాపావనిని విద్యార్థులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధానాచార్యురాలు విజయభారతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారి ఉన్నతికి కృషి చేసేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు అన్నారు. విద్యార్థులు ఏ రంగంలో స్థిరపడినా వారి ఉన్నతికి కారకులైన గురువులను ఎన్నటికీ మరువలేరన్నారు. రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వారైనా వారు చదువుకున్న, వారికి చదువు చెప్పిన గురువులను ప్రతినిత్యం స్మరించుకుంటారని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి గురుపూజోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జరకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.