పాడేరు సబ్ కలెక్టర్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావానికి తోడైన వాయు గండం పట్ల మన్యవాసులు అప్రమత్తంగా ఉండాలని పాడేరు సబ్ కలెక్టర్ అన్నారు. సోమవారం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పపీడన ప్రభావంతో మన్య ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదు కావడంతోపాటు మన్య ప్రాంతంలో అనేక రహదారులు కోతకు గురై కల్వర్టులు, అప్రోచ్ రహదారులు కొట్టుకుపోయిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహన చోదకులు ఆచితూచి ప్రయాణం చేయాలని సూచించారు. కాలువలు దాటే క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.