తెదేపా పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఈశ్వరి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్కిల్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కు మంజూరు కావడం సంతోషకరమని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆధారాలు లేని కేసులో ఆయనను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే అన్నారు. సుమారు 50 రోజులకు పైగా కారాగారంలో ఉంచి ఇబ్బంది పెట్టినప్పటికీ మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు హైకోర్టు లో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం శుభ పరిణామం అన్నారు. చంద్రబాబు తరఫు లాయర్ ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తాజాగా బెయిల్ మంజూరు చేయడం ధర్మానికి, న్యాయానికి దక్కిన తీర్పుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.