Friday, December 8, 2023
Friday, December 8, 2023

లీక్ అవుతున్న త్రాగునీటి పైపులు… వృధాగా పోతున్న త్రాగునీరు.

పంచాయతీ కార్యాలయం చెంతనే ఈ దుస్థితి

పలు వీధులలోనూ ఇదే పరిస్థితి.. చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పుష్కలంగా త్రాగునీటి సమస్య ఉన్న చింతపల్లి మండల కేంద్రంలోనే త్రాగునీరు పైపులు లీక్ అవుతుండడం వలన నీరు వృధాగా పోతున్నా పైపులు మరమ్మత్తు పనులు నిర్వహించి నిత్యం ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయవలసిన అధికారులు, పంచాయతీ పాలకవర్గం పైపులు లీక్ అవుతూ నీరు వృధాగా పోతున్నా పాలకులు, అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం బాధాకరం. మండల కేంద్రంలోని పలు వీధులలో ఇదే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయితీ కార్యాలయం చెంతనే త్రాగునీటి పైపు లీక్ అయి నీరు వృధాగా పోతుండటం, త్రాగునీటి సమస్యలను పరిష్కరించవలసిన అధికారులు చోద్యం చూస్తుండడం పలు విమర్శలకు తాగిస్తుంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులకు గురైన త్రాగునీటి పైపులను మరమ్మత్తు పనులు చేపట్టి వృధాగా పోతున్న త్రాగునీటిని నియంత్రించేందుకు తద్వారా పంచాయతీ ప్రజలకు పుష్కలంగా త్రాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img