లమ్మసింగి సర్పంచ్ శాంతి కుమారి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాజ్మా విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని లమ్మసింగి సర్పంచ్ కొర్రా శాంతి కుమారి అన్నారు. లమ్మ సింగి పంచాయతీలో సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో రాజ్మా విత్తనాలు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎంపీటీసీ రావుల. నాగమణి, తెదేపా సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య లతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె ప్రభుత్వం సరఫరా చేసిన రాజ్మా విత్తనాలను వారితో కలసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాజ్మా విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొర్రా రఘునాథ్, యన్ డీ ఏ కూటమి నాయకులు పీ రామూర్తి, మహేంద్ర, చిన్నిరాజుబాబు, లోవరాజు, కృష్ణమూర్తి, అధిక సంఖ్యలో పంచాయితీలోని రైతులు పాల్గొన్నారు.