ఆదివాసీ జెఏసి నాయకుల పిలుపు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- బిర్శాముండా జయంతిని జయప్రదం చేయండని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి నాయకులు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించ నున్న
భగవాన్ బిర్సాముండా 149 వ జయంతిని ఈ నెల 14,15 తేదీ లలో జాతీయ ఆదివాసీ సదస్సు సాంసృతిక కళా ప్రదర్శనలను విజయవంతం చేయాలని, భగవాన్ బిర్సాముండా 149 వ
జయంతి సందర్భంగా దేశంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశ వ్యాప్తంగా పని చేస్తున్న సంఘాలు, సంస్థలు, వ్యక్తులు కలిసి తమ తమ అనుభవాలను నివృత్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ఆదివాసీ జెఏసీ యోచించి, రెండు రోజుల పాటు జరగనున్న ఇష్టా చర్చలలో సహృద్భావ వాతావరణంలో ఫలప్రదమైన ఛర్చలు జరపాలని, అభిప్రాయాలను ఎవరూ బలవంతంగా మార్చుకోవలసినవసరంలేదని, స్వేచ్చగా చర్చించుకొన్న తరువాత నిర్ణయాలు తీసుకొందామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,జెఏసీ ఇంటలెక్సవల్ సభ్యులు బౌడు గంగారాజు, గెమ్మెల మోహనరావు, దేపూరి శశికుమార్, లోచెల చిట్టినాయుడు, గెమ్మెల కామేశ్వర్రావు, గోపినాధ్ పాల్గొన్నారు.