వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి, ఎంపీపీ అనూష దేవి, జెడ్పీటీసీ బాలయ్య
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఈ నెల 9 నుండి నిర్వహించిన పల్లి నిద్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైకాపా మండల అధ్యక్షుడు మోరి, రవి, ఎంపీపీ కోరాబు అనూష దేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. . బుధవారం వారు మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ వైకాపాను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్క వైకాపా కార్యకర్త సైనికునిలా పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనే నినాదంతో ఈ నెల 9వ తారీకు నుండి 23వ తారీకు వరకు వివిధ సచివాలయాలలో పల్లెనిద్ర కార్యక్రమం జరుగుతుందని, ప్రజల కోసం జగనన్న చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజలకు వివరించి ప్రతి వైకాపా సర్పంచ్, ఎంపీటీసీ లతో పాటు, పార్టీ శ్రేణులంతా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని, తద్వారా మళ్లీ పాడేరు నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేను, అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.