సర్పంచ్ లకు అరుదైన అవకాశం కల్పించిన నేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జనసేన అల్లూరి జిల్లా కార్యదర్శి సీతారాం
విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నిజమైన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా పంచాయతీ సర్పంచ్ లకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జెండా వందనం ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించి అరుదైన అవకాశం కల్పించారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ 78వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీ సర్పంచ్ లకు మేజర్ పంచాయతీకి 25 వేల రూపాయలు, చిన్న పంచాయతీలకు పదివేల రూపాయలు చొప్పున నిధులు కేటాయించి దేశ స్వాతంత్ర్య వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. గ్రామపంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు అని భావించిన పవన్ కళ్యాణ్ ఆదిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు జన సైనికులు కూడా అందులో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.