వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్న వైకాపా శ్రేణులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- వైకాపా ప్రజాసంకల్పయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కోరాబు అనూష దేవి జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు దురియా పుష్పలత ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ముందుగా పాత బస్టాండ్ గాంధీ కూడలిలోని వైయస్సార్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రజాసంకల్పయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకుని ఏడవ వేట అడుగిడుతున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి వారు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ అమర్ రహే, వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపాకు చెందిన మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.