జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యవర్గ సభ్యుడిగా, చింతపల్లి మండలం సంఘం ప్రతినిధిగా దూనబోయిన రమణను నియమించినట్లు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూనబోయిన రమణ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, గత కొంతకాలంగా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న చింతపల్లి గ్రామానికి చెందిన దూనబోయిన రమణను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఎం. విజయ సునీతను జాతీయ సంఘం ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసిన కార్యక్రమంలో దూనబోయిన రమణ కూడా పాల్గొన్నారనీ, ఇక నుండి అల్లూరి సీతారామరాజు చరిత్ర వ్యాప్తికి, అల్లూరి పితూరీలో పనిచేసిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల అభ్యున్నతి కోసం తమతో భాగస్వామిగా కృషి చేస్తారనే ప్రగాఢ విశ్వాసంతో ఆయనను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన కార్యవర్గ సభ్యునిగా నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆ ప్రకటనలో వివరించారు.