విద్యుత్ వినియోగదారుల విన్నపం
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గ్రామంలో ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించవలసిన అవసరం ఉంది. స్థానిక ముఠా దారి వీధి లోనూ, అదే విధంగా సాయి నగర్ వీధి, ఇలా పలు చోట్ల పురాతన ఇనుప విద్యుత్ స్తంబాలు శిదిలావస్థకు చేరి, ఒక వైపుకు ఒరిగి పోయి గాలులకు కూల్ విధం గానూ, పట్టుకుంటే షాక్ కొట్టి ప్రాణాలు బలి తీసుకునే విధం గానూ తయారయ్యాయి. వీటి వలన ప్రమాదం పొంచి ఉందని వాటిని తొలగించాలని పత్రికా ముఖంగానూ, పలు మార్లు మండల సర్వసభ్య సమావేశాలలో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాది కారుల సాక్షిగా సాక్షాత్తు పాత్రికేయులు ఈ సమస్యను లేవనెత్తినప్పటికీ సంభందిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ముఠా దారి వీధి లోనూ, సాయి నగర్ వీధి లోనూ అదే క్రమంలో గ్రామంలో నిరుపయోగంగా ప్రమాధ భరితంగా దర్శనమిస్తున్న విద్యుత్ స్తంభాలను శాశ్వతంగా తొలగించాలని ఆయా ప్రాంత ప్రజలు కోరుతున్నారు.