Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

రైతు భరోసాను సద్వినియోగం చేసుకోండి

గిరి రైతులకు సూచించిన సర్పంచ్ పుష్పలత

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నిధులను ప్రతీ రైతు సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగం లో ఆర్థికంగా నిలదొక్కు కోవాలని చింతపల్లి సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రైతు భరోసా రెండో విడత లాంచ్ చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని. చిన్నగెడ్డ.గ్రామ సచివాలయం లోని రైతు భరోసా కేంద్రంలో రైతులతో కలిసి ఆమె టీవీ లైవ్ కార్యక్రమంలో పాల్గొని రైతులకి సంబంధించిన రైతు భరోసా గురించి, పెట్టుబడి రుణాలు ఏ విధంగా చేయాలో వివరించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ విహెచ్ఎ చంద్రకళ, వాలంటరీ మండల అధ్యక్షులు వేములపూడి పరమేశ్వర, గ్రామ సచివాలయ వాలంటీర్స్, చిన్న గెడ్డ గ్రామ సచివాలయ పరిధిలోని రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img