ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండలరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులంతా సర్వేపల్లి రాధాకృష్ణ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండలరావు అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమం ఉన్నత పాఠశాల -2, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ (ఏపిటిఎఫ్) ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేపూరి శశి కుమార్, కార్యదర్శి గెమ్మేల మోహన్, మండల అధ్యక్షుడు బౌడు గంగరాజులు గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండలరావు మాట్లాడుతూ విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించి విద్యార్థులను వివిధ రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడంలో కృషిచేసిన పలువురు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా గౌరవించడంలో భాగంగా ఏపీటీఎఫ్ తరఫున ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు, స్కూల్ అసిస్టెంట్ రామయమ్మ , ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల 2 ప్రధానోపాధ్యాయులు పలాసి పండన్న , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అప్పారావుల సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఏపీటీఎఫ్ నాయకులు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు