Friday, December 8, 2023
Friday, December 8, 2023

చిన్నారి నిత్య మరణం విషాదకరం

బాధిత కుటుంబానికి బాసటగా ఉంటాం..

ఎంపీపీ అనూష దేవి, జడ్పిటిసి బాలయ్య, వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మండలంలోని అన్నవరం పంచాయతీ కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో సజీవ దహనమై మృతి చెందిన చిన్నారి నిత్య (7) కుటుంబానికి బాసటగా ఉంటామని ఎంపీపీ కోరాబు అనూష దేవి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి అన్నారు. సోమవారం అన్నవరం గ్రామంలో చోటుచేసుకున్న విషాద సంఘటనను తెలుసుకున్న వారు అన్నవరం వెళ్ళి బాదిత కుటుంబాన్ని పరామర్శించి నిత్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని కీలల్లో చిక్కిన నిత్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. చలికాలం కావడం వలన చలికాచుకునేందుకు చిన్నారులు మంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నిత్య కుటుంబానికి వైకాపా ప్రభుత్వం బాసటగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో, వారితోపాటు వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో గ్రామస్తులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img