Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

నీట్ నిర్వహణ, అవకతవకలు పై ఈ నెల 4 న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ …

పి.డి.ఎస్.ఓ …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.02.07.2024ది. నీట్ పరీక్షల నిర్వహణ, అవకతవకలు, స్కాం పై న్యాయవిచారణ కోరుతూ ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా జరుప తలపెట్టిన విద్యా సంస్థలు బంద్ ను విజయవంతం చేయవలసిందిగా విద్యార్థి సంఘం యూనియన్ పి.డి.ఎస్.ఓ. కోరుతోంది.
ఈ మేరకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద పిడిఎస్ఓ ప్రకటన విడుదల చేసింది. పిడిఎస్ఓ జిల్లా కో- కన్వీనర్ ఏ.మౌనిక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్టిఏ నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో స్కాం జరిగిందని, సిబిఐ కి బీహార్లో పోలీసులు పట్టుకున్న కొంతమంది నీట్ ఎగ్జాం పేపర్ ని 30 లక్షలు అమ్ముకున్నామని ఒప్పుకోవడం జరిగిందని తెలియజేసారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో 1 లక్షా 20 వేల పోస్టులకు గాను, కోటి 40 లక్షల మంది అప్లై చేసిన 41 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి అని చెప్పేసి కొన్ని పత్రికలు చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో తేలడం జరిగిందన్నారు. పరీక్షలు ఎలా రాయాలో పిల్లలకి పరీక్ష లా పై చర్చ అనే కార్యక్రమంలో దేశ గౌరవ ప్రధాని మోడీ పరీక్షలను ఎందుకు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించారు. పరీక్ష పత్రాలు లీకేజీలను, సక్రమంగా ఎగ్జామ్ లను నిర్వహించలేని ప్రధాని మోడీ విశ్వగురు ఎలా అవుతారన్నారు. ప్రపంచ యుద్ధాలనే ఆపేయగలిగే సత్తా ఉందని చెప్పుకుంటున్న మోడీ 23½ లక్షల మంది వైద్య విద్యార్థులకు వచ్చిన ఈ నీట్ ఎగ్జామ్ స్కాం సమస్యను ఎలా పరిష్కరిస్తారు? తక్షణమే ఎన్. టి.ఏ. ని రద్దు చేయాలి. ఇంతకుముందు లాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వైద్య విద్య ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించుకునేటట్లు చూడాలని కోరారు. నీట్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్ రద్దుచేసి మరలా నిర్వహించాలని, నీట్ స్కాం బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి స్కాం లు మరల జరక్కుండా తగిన జాగ్రత్తలు, విధి విధానాలు రూపొందించాలని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ స్కాములపై అసెంబ్లీ తీర్మానం చేసిన విధంగా ఏ.పీ ప్రభుత్వం కూడా నీట్ ఎగ్జాం పై మళ్లీ జరపాలని తీర్మానం చేయాలని కోరారు తగినన్ని వైద్య విద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని దేశ వ్యాప్తంగా మూసివేసిన పాఠశాలలను మళ్ళీ తెరిపించాని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘం డిమాండ్ల సాధన కోసం జూలై 4న రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని విద్యాసంస్థలు, ప్రభుత్వం స్వచ్ఛందంగా బందుకు మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కమిటీ సభ్యుడు బి. రాజేష్, ఎం.ధనలక్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img