‘”విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై ,
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోరుతూ”‘
విశాలాంధ్ర – చోడవరం : రాష్ట్ర వ్యాప్తంగా బుదవారం తలపెట్టిన విద్యార్థి, యువజన సంఘాల పిలుపుతో కేజీ టూ పీజీ విద్యాసంస్థల బంద్ ను చోడవరంలో విజయవంతం చేసారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం చేసారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘ నాయకులు మాట్లాడుతూ…”స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కి సొంతగనులను కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ లో కాళిగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల నమ్మకాన్ని ఆపాలని, యువతకి భద్రతతో కూడుకున్న ఉపాధి అవకాశాలను కల్పించాలని, విభజన హామీలలో భాగంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని వారి డిమాండ్ తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్ కు విద్యాసంస్థలు, ప్రజలు అందరూ తమ సంపూర్ణ సహకారాన్ని అందించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున బందులో పాల్గొని విజయవంతం చేసినందుకు, అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు ధన్యవాదాలు తెలియజేశారు”.ఈ కార్యక్రమంలో లో పీడీఎస్ఓ జిల్లా నాయకులు సియ్యాద్రి. రుద్రి, ఏ.మౌనిక, బి.రాజేశ్,పద్దు, డి.వై.ఎఫ్.ఐ.జిల్లా కార్యదర్శి యస్.వి.నాయుడు, ఎస్.ఎఫ్.ఐ.జిల్లా సభులు సుందర్, ఎం. కామేష్ , కె. సింహాచలం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి కమ్యునిస్ట్ నేతలు సంఘీభావం తెలిపారు.